Chapter 10: chapter 10

Ho my loveWords: 6565

నేను కింగ్ ని కాదు, కింగ్‌ని నడిపించే ప్లేయర్‌ని. చెస్ బోర్డు మీద నా ప్రతి మూవ్ గెలుపుకు దారి తీస్తుంది! దట్ ఇస్ ఆదిత్య!’ అనుకుంటూ సీట్లో కూర్చొని గర్వంగా కాలుపై కాలు వేసుకున్నాడు.ఆదిత్య కూర్చోగానే  ఒక్కసారిగా కాన్ఫరెన్స్ హాల్లో లైట్స్ అన్ని ఆఫ్ అయి స్టేజ్ పైన లైట్స్ వెలిగాయి. సెంటర్లోకి ఎల్ఈడి స్క్రీన్ పై  విక్రమ్ ద్రౌకి సంబంధించిన ఏవి ప్లే చేశారు అది పూర్తవ్వగానే… హోస్ట్ నడుచుకుంటూ వచ్చి… “లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ నైట్ మనమంతా ఒక గొప్ప వ్యక్తి చేసిన పనులకు కృషికి దక్కిన గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నం. ఆయన చేసిన ఇన్నోవాషన్ దేశ అభివృద్ధికి పునాదులు వేయడమే కాకుండా, ఎంతోమంది యూత్ జీవితాన్ని ముందుకు నడిపించింది. ఆయనే ది గ్రేట్ సుప్రీం సిటిజన్ అవార్డు గ్రహీత మిస్టర్ విక్రమ్ ధ్రువ్! వెల్కమ్ మిస్టర్ ధ్రువ్” అంటూ విక్రమ్ ని స్టేజ్ పైకి ఆహ్వానించింది. విక్రం చిన్నగా నవ్వుతూ  స్టేజ్ పైకి వెళ్తుండగా కాన్ఫరెన్స్ హాల్ మొత్తం అక్కడ ఉన్న వారి కరచాల ధ్వనులతో మారు మ్రోగిపోయింది. అతనికి హోస్ట్ ఇచ్చిన బిల్డప్, తన చుట్టూ ఉన్నవారు అంతా చూపిస్తున్న అభిమానం చూసి ఆదిత్య అసూయతో రగిలిపోయాడు.  ఆవేసంతా అతని పిడికిలి బిరుసుకొని చేతి నరాలు పైకి ఉబ్బిపోయాయి. కానీ ఫేసులో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా కూల్ గా కూర్చుని అక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉన్నాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అర్జున్ చూశారా బాస్ మీరు అతని గురించి ఏదైనా చెప్పారు కానీ అతను మాత్రం చాలా కూల్ గా కూర్చొని ప్రోగ్రాం  చూస్తున్నాడు! మీరు చెప్పినంత ఎఫెక్ట్ అయితే నాకేమీ కనిపించడం లేదు అన్నాడు. కూల్ గా ఉండటం కాదురా ప్రెజర్ కుక్కర్లో లోపలకి కుతకుతా ఉడికిపోతున్నాడు. అదంతా నీలాంటి సామాన్యులకు కనబడదు. అది చూడాలంటే నాలాంటి మేధావులు బలే అవుతుంది అంది అనన్య. విక్రమ్ స్టేజ్ పైకి వెళ్ళగానే పోస్ట్ తన చేతికి మైక్ ఇచ్చింది. అతను చిన్నగా నవ్వుతూ తన స్పీచ్ ని స్టార్ట్ చేశాడు. అక్కడున్న వారందరినీ ఉద్దేశించి “గెలవడం అంటే కేవలం ఇన్నోవేషన్ మాత్రమే కాదు! innovators గా మనపై ఒక బాధ్యత ఉంది. మన చుట్టూ ఉన్న రిసోర్స్ ని యూస్ చేసుకుంటూ అందరికీ యూస్ అయ్యేలా ఒక కొత్త ప్రపంచాన్ని అందరి కోసం సృష్టించాలి. నా టీమ్ లేకపోతే ఈ సక్సెస్ నాకు సాధ్యమయ్యేది కాదు. అలానే ధ్రువ్ ఇండస్ట్రీని నమ్మి మాతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా థాంక్స్ చెప్తున్నాను. థాంక్ to ఎవరీ వన్! ఒంటరిగా ఈ విక్రమ్ ద్రో ఈ సక్సెస్ ని సాధించలేడు కాబట్టి ఈ సక్సెస్ మనందరిదీ” అంటూ అవార్డుని పైకెత్తి అక్కడ ఉన్న తనటీమ్ వైపు చూపిస్తూ చెప్పాడు. అతని స్పీచ్ కి హాల్ మొత్తం దద్దరిల్లిపోయేలా సౌండ్స్ వినిపించాయి. తన సక్సెస్లో టీం తో పాటు కంపెనీ కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరిని భాగం చేసుకోవడంతో అక్కడ ఉన్న వారిలో చాలామందికి విక్రమ్ పై మరింత అభిమానం పెరిగింది. నిజంగానే తను తన చుట్టూ ఉన్న వారిని మాటలతో కట్టిపడేయ్ గల నేర్పరి.To be continued....