Chapter 11: chapter 11

Ho my loveWords: 5591

తన సక్సెస్లో టీం తో పాటు కంపెనీ కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరిని భాగం చేసుకోవడంతో అక్కడ ఉన్న వారిలో చాలామందికి విక్రమ్ పై మరింత అభిమానం పెరిగింది. నిజంగానే తను తన చుట్టూ ఉన్న వారిని మాటలతో కట్టిపడేయ్ గల నేర్పరి.కొంతమంది పైకి లేచి విక్రమ్ కి షేక్ అండ్ ఇస్తూ కంగ్రాట్స్ చెప్పడానికి ముందుకు వచ్చారు. కానీ ఆదిత్య కూర్చున్న ప్లేస్ నుంచి అంగుళం కూడా కదలకుండా విక్రమ్ ని చూస్తూ ఉన్నాడు.విక్రమ్ సక్సెస్ లో వేరే వాళ్ళని ఇంక్లూడింగ్ చేసి చెప్పడం ఆదిత్యకి ఆశ్చర్యంగా అనిపించింది. సరిగ్గా అప్పుడే అతను చుట్టూ ఉన్న కొంతమంది విక్రమ్ ని మెచ్చుకుంటూ మాట్లాడటం స్టార్ట్ చేశారు.చూడు అంత పెద్ద విజయం సాధించిన ఇంత కూడా గర్వం లేకుండా తన టీం ని కంపెనీతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యంలో చేశాడు” అని ఒకరు అంటే..ఇదేం చూసావ్!? విక్రమ్ ధ్రువ్ తన మాటల్లోనే కాదు  చేతల్లో కూడా తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కాకుండా తన కంపెనీ నుండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు అని చెప్పాడు మరొకడు. అవును నిజంగానే ఈ తరం యువతరానికి విక్రమ్ ఒక ఇన్స్పిరేషన్. అతని రోల్ మోడల్ తీసుకున్న ఎవరైనా ఇలా తన చుట్టూ ఉన్న వాళ్ళు అసలు అక్కడ తన ఒకడున్నాడు అనే విషయం మరిచిపోయి  విక్రమ్ చేసిన మంచి పనుల గురించి చెవులు కోరుకుంటే  అదంతా తనకు చాలా అవమానంగా అనిపించింది.‘ఈ విక్రమ్ గాడు ఇన్స్పిరేషన్ కాదు.  ఒక obstacle మాత్రమే. నాకు దక్కాల్సిన స్థానానికి ఎలాంటి అర్హతలు లేకుండా కొట్టేసిన ఒక దొంగ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నాకు దక్కల్సిందే దక్కించుకునే తీరుతాను’ అనుకున్నాడు.ఇంకా అక్కడ ఉండాలనిపించక వైన్ గ్లాస్ అందుకొని బాల్కని వైపు నడిచాడు. ఆదిత్య బయటకు వెళ్లడం చూసినం అనన్య చెప్పానా!? ఎదుటివారి సక్సెస్ ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడని, ధ్రువ్ ఇండస్ట్రీకి దక్కిన విజయాన్ని, విక్రమ్ ధ్రువ్ గెలుపుని ఇక్కడే ఉండి చూడలేక బయటికి ఎలా వెళ్ళిపోతున్నాడో!  అయినా వాడి గురించి మనకెందుకు, ముందు విక్రమ్ ధ్రువ్ పైన కాన్సన్ట్రేట్ చెయ్! మరో వన్ వీక్ వరకు మన చానల్లో ఇదే హాట్ టాపిక్ న్యూస్! ఇది సరిగ్గా కవర్ చేయకపోతే మూర్తి ఏడుపు తట్టుకోలేం” అంది.అర్జున్ బయటకు వెళ్తున్న ఆదిత్యని చేస్తూ సైలెంట్ గా ఉండిపోయాడు.అవార్డ్ cermany కంప్లీట్ అయ్యేంతవరకు అక్కడే ఉండిపోయాడు.బయటకు చూస్తూ… విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ‘ఈ విజయం AR tech solution దక్కాల్సింది.  ఈ ప్రశంసలన్నీ కూడా నాకు చెందినవి నాకు మాత్రమే దక్కాల్సినవి. To be continued....