Chapter 12: chapter 12

Ho my loveWords: 5899

బయటకు చూస్తూ… విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ‘ఈ విజయం AR tech solution దక్కాల్సింది.  ఈ ప్రశంసలన్నీ కూడా నాకు చెందినవి నాకు మాత్రమే దక్కాల్సినవి. అయినా వాడేంటి మనం ఏం చేసిన దేశం అభివృద్ధి చెందాలి ప్రజలు బాగుపడాలి అని పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడు. Selfless ఫెలో!’ అనుకున్నాడు. ఒంటరిగా నిలబడి ఏవో ఆలోచనలో మునిగిపోయిన ఆదిత్యని చూసి ‘వామ్మో ఇప్పుడు ఎవరు కొంప ముంచడం గురించి ఆలోచిస్తున్నాడు ఏంటో! ఇప్పుడు వెళ్లి కదిపితే ఏమంటాడో!’ అనుకుంటూ భయంగా ఆదిత్య దగ్గరకు నడిచాడు రాహుల్.సా.. సార్! ప్రశ్నలు మిమ్మల్ని పిలుస్తున్నారు అవార్డ్ సెర్మనీ గురించి మీ ఇంటర్వ్యూ కావాలంట!” అని చిన్నగా చెప్పాడు రాహుల్. అప్పటివరకు ఆలోచనలో మునిగిపోయిన ఆదిత్య మెల్లిగా తలతిప్పి రాహుల్  ని చూస్తూ… ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు అని వాళ్లకు చెప్పు, అయినా వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాల్సింది నన్ను కాదు అవార్డు విన్ అయిన విక్రమ్ ని, వెళ్లి అతని సంతోషంలో భాగం అవమని చెప్పు ఎవరికి తెలుసు రేపు ఈ ఆనందం అతని దగ్గర ఉంటుందో లేదోనని” అన్నాడు. రాహుల్ సరేనని తలుపి వెనక్కి తిరిగాడు. ‘వామ్మో వెంటనే ఇంటికి ఫోన్ చేసి మామిడికి మేడపైన ఆరబెట్టిన బట్టలు తీసిందో లేదో కనుక్కోవాలి భారీ వర్ష సూచన కనబడుతుంది. లేకపోతే  ఈ వ్యాంపైర్ గాడు వేరే వాడి సక్సెస్ ని చూసి ఇంత కూల్ గా మాట్లాడడం ఏంటి’ అనుకున్నాడు. వర్ష సూచన మాత్రమే కాదు రాహుల్ తుఫాన్ రాబోతుందని చెప్పు” అంటూ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని  ఖాళీ చేశాడు ఆదిత్య. వామ్మో మనసులో అనుకున్నది కూడా వినబడిందా అనుకుంటూ అక్కడి నుండి తుర్రుమన్నాడు రాహుల్. అవార్డ్ ceremony నుంచి డైరెక్ట్ గా AR టెక్ సొల్యూషన్స్ ఆఫీస్ కి చేరుకున్నాడు ఆదిత్య. నైట్ కావడంతో ఆఫీస్ అంత సైలెంట్ గా ఉంది.  అతని అడుగున చప్పుడు ఆఫీస్ అంత ప్రతిధ్వనిస్తుంటే అతని చెవులకు మాత్రం విక్రమ్ ని పొగుడుతూ చెప్తున్న మాటలే  మారుమ్రోగుతున్నాయి. విసురుగ తన కోట్ ని తీసి  చైర్ పై పడేసి సీక్రెట్ చాంబర్ వైపు నడిచాడు ఆదిత్య. అప్పటికే సంజయ్ వాళ్లు డిజైన్ చేసిన AI ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ..  అక్కడే ఉన్నాడు. ఆదిత్య సహనంగా  నెమెసిస్ బ్లూ ప్రింట్ ముందు నిలబడి ఇది పూర్తవడానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుంది అని అడిగాడు. అప్పటివరకు తన పనిలో మునిగిపోయి ఉన్న  సంజు అతని మాటలకు మెల్లిగా తలపైకి ఎత్తి ఆదిత్య వైపు చూసాడు. విక్రమ్ కి దక్కిన ఈ సక్సెస్ ఇమేజ్ ని కూల్చివేయాలంటే తను డెవలప్ చేస్తున్న new AI ప్రాజెక్ట్ తన దగ్గర ఉన్న ఆయుధమని ఆదిత్య అనుకుంటున్నాడు. మరి ఇందులో ఆదిత్య సక్సెస్ అవ్వగలడా!? తను అనుకుంటున్నట్లుగా విక్రమ్ సామ్రాజ్యాన్ని కూల్చగలడా!?To be continued....