Chapter 13: chapter 13

Ho my loveWords: 6148

విక్రమ్ కి దక్కిన ఈ సక్సెస్ ఇమేజ్ ని కూల్చివేయాలంటే తను డెవలప్ చేస్తున్న new AI ప్రాజెక్ట్ తన దగ్గర ఉన్న ఆయుధమని ఆదిత్య అనుకుంటున్నాడు. మరి ఇందులో ఆదిత్య సక్సెస్ అవ్వగలడా!? తను అనుకుంటున్నట్లుగా విక్రమ్ సామ్రాజ్యాన్ని కూల్చగలడా!?సీక్రెట్ చాంబర్ లోపలికి ఆదిత్య అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న లైట్లు ఒక్కసారిగా మెరిసాయి. అప్పటికే లోపల ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్న సంజయ్ పూర్తిగా పనిలో మునిగిపోయి అతను వచ్చిన విషయాన్ని గమనించలేదు. ఆదిత్య అసహనంగా ఇది పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అనగానే సంజయ్ తలపైకెత్తి  ఇంకా దీన్ని మనం పూర్తిగా టెస్ట్ చేయలేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఆదిత్య కోపంగా “రణ్ డయాగ్నస్టిక్స్” అని ఆడర్ వేసాడు. సంజయ్ ఆశ్చర్యంగా ఆదిత్య నేను చెప్పేది విను మనం ఇంక దీన్ని పూర్తిగా టెస్ట్ చేయలేదు, ఇది పూర్తి కావడానికి మనకి ఇంకొంచెం టైం పడుతుంది ఆ తర్వాతనే టెస్ట్ చేయగలం. ఇలా ప్రాజెక్ట్ ఇన్ కంప్లీట్ గా ఉన్నప్పుడే టెస్ట్ చేయాలనుకుంటే దాని వల్ల మరిన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని చెప్పాడు. ఆదిత్య సీరియస్ గా అతని వైపు చూస్తూ… “ఏదైనా ప్రమాదం జరుగుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయపడితే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఎలా జరుగుతాయి సంజయ్. అయినా ఈ ఆదిత్య ముందు నిలబడి నువ్వు ఇలా భయపడటం కరెక్ట్ కాదు” అన్నాడు.“నాకు తెలుసు ఆదిత్య కాని ఒకసారి నేను చెప్పేది కూడా విను రిస్క్ ఎక్కువగా ఉందని తెలిసి ముందుకు అడుగు వెయ్యడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అన్నాడు సంజయ్. ఇప్పుడు నాకు నీ ఒపీనియన్తో పనిలేదు. హాస్ సూన్ హాస్ పాసిబుల్ నాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి త్వరగా చెయ్! నీ వల్ల కాదంటే తప్పుకో నేనే చేస్తాను అన్నాడు ఆదిత్య. ఇక ఎంత చెప్పినా ఆదిత్య తన మాటలు వినడని అర్థమయిష్టంగానే తలుపి ప్రాజెక్ట్ కి వైరస్ టెస్టింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశాడు. సిస్టం ఆన్ అవగానే ఒక్కసారిగా గదంతా లైట్స్ ఆఫ్ ఎ బ్లూ కలర్ లైట్ తో నిండిపోయింది. సెంట్రల్ మోనిటర్ పై గ్రీన్ కలర్ కోడింగ్ శర వేగంగా కదులుతూ ఉంది. అదంతా చూస్తున్న సంజయ్ మనసులోనే ఇది ఇప్పుడు ఏ ప్రమాదానికి దారి తీయబోతుందో అనుకున్నాడు. వాళ్లు క్రియేట్ చేసిన ఏఐ ప్రాజెక్టులోని ప్రాబ్లమ్స్ లను గుర్తించటానికి,  డేటాబేస్ ఎర్రర్స్ సర్వర్ డౌన్ వంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు సంజయ్. సీక్రెట్ చాంబర్లో వాళ్లు చేపట్టిన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి డయాగ్నస్టిక్ జరుగుతూ ఉంటే ఆదిత్య గదిని ఆనుకుని ఉన్న తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళాడు. ఆ గది చూడటానికి  మినీ హౌస్ లా  ఉంది. ఆ రూమ్ లో ఎవరి ఫోటోలు కానీ పెయింటింగ్స్ కానీ లేవు కేవలం అతనికి  అవసరమైన వస్తువులు వర్క్ చేసుకోవడానికి యూస్ గా ఉండే డెస్క్ దాని ముందు హై-బ్యాక్డ్ చైర్ వుంది. To be continued....