Chapter 15: chapter 15

Ho my loveWords: 6183

ఆదిత్య మాటలు విన్న సంజయ్ కి భయం ఎక్కువయింది. ఏం మాట్లాడుతున్నావ్ ఆదిత్య అలానే కావాలి అంటే అర్థమేంటి ఫ్యూచర్లో ఇది మన కమాండ్స్ ని కూడా లెక్కచేయకపోవచ్చు, దీన్ని మనం అదుపు చేయలేకపోయామంటే అప్పుడు అది మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా” అన్నాడు.సంజయ్ నేను నీ భాషను మాత్రమే కాదు నీ ఫ్రెండ్ ని కూడా అన్న విషయం ఎలా మర్చిపోయా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావ్! అని అడిగాడు ఆదిత్య. అంటే నువ్వు ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయబోతున్నావా అని అడిగాడు సంజయ్. ఆదిత్య చిన్నగా నవ్వుతూ పక్కకి తప్పుకో అంటూ చైర్ లో కూర్చుని సంజయ్ చెప్పిన ప్రాబ్లమ్స్ ని  సరి చెయ్యడానికి ట్రై చేశాడు. కొన్ని రోజులు పాటు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడంలోనే మునిగిపోయాడు. సిస్టంలో తనకి కావలసిన విధంగా మార్చటానికి నిద్రాహారాలు మాని పనిచేశాడు ఆదిత్య. సార్ బాస్ కొన్ని రోజులు నుండి కంపెనీ పనులన్నీ పక్కన పెట్టి మరి కొత్త ప్రాజెక్టు గురించి వర్క్ చేస్తున్నారు కదా ఇంకా కంప్లీట్ కాలేదా ఎప్పటికి అవుతుంది. ఇక్కడ చాలా మీటింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి  అన్నాడు రాహుల్. సంజయ్ చిన్నగా నవ్వుతూ… తను అనుకున్న పని పూర్తయ్యేంతవరకు వదిలిపెట్టని మొండిఘటం వాడు.  చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా వాడిని తనత ఫ్యామిలీకి టైం ఇస్తే కంపెనీ గ్రోత్ లేట్ అవుతుందని ఫ్యామిలీని దూరం పెట్టినవాడు. హి ఇస్ ఏ జీనియస్ తను చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే బయటకు వస్తాడు. ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్స్  లాంటివి ఉంటే మనమే మేనేజ్ చేయాలి ఇప్పుడు అప్పుడే వాడు బయటికి రాడు అని చెప్పాడు సంజయ్. జీనియస్ ఆ లేక పిచ్చివాడా అని చిన్నగా కొనుక్కున్నాడు రాహుల్. “ఏంటి మా వాడి టార్చర్ కి బాగా ప్రస్టేట్ అవుతున్నట్లుగా ఉన్నావ్! బాస్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా నా ముందే వాడిని తిట్టేస్తున్నావ్!” అని నవ్వుతూ అడిగాడు సంజయ్. ఫ్రస్టేషన్ అని మెల్లిగా అడుగుతారు ఏంటి సార్! ఇంట్లో భార్య టార్చర్ తట్టుకోలేక ఎవరైనా ఆఫీసుకు రావాలి అనుకుంటాడు. కానీ నేను మాత్రం బాస్ టార్చర్ తట్టుకోలేక ఇంటికి ఎప్పుడు ఎంత త్వరగా వెళ్లిపోదామా అనుకుంటున్నా. ఆఫీసులో కొలీగ్స్ అందరూ వాళ్ళ వైఫ్ తమని ఎంతగా టార్చర్ చేస్తున్నారో చెప్తుంటే… నాకు మాత్రం మనం బాస్ పెట్టే టార్చర్ కంటే వాళ్ళు పెట్టే టార్చర్ బెటర్ అనిపిస్తుంది సార్!” దిగులుగా అన్నాడు రాహుల్. అవునా అంతలా ఏం టార్చర్ చేస్తున్నాడోయ్ మా వాడు” అని అడిగాడు సంజయ్. ఏం టార్చర్ చేస్తున్నాడా? నేను మనిషిని అనుకుంటున్నారా లేక రోబో ని  అనుకుంటున్నారా సార్! చెప్పిందే చేయాలి అంటాడు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడు ఆయన చెప్పిందే మనం వినాలి. అంటూ జాయిన్ అయినప్పటినుండి తనని ఎన్ని రకాలుగా టార్చర్ చేశాడో మొత్తం సంజయ్ ముందు బయట పెట్టాడు రాహుల్.To be continued....