Chapter 16: chapter 16

Ho my loveWords: 6379

ఏం టార్చర్ చేస్తున్నాడా? నేను మనిషిని అనుకుంటున్నారా లేక రోబో ని  అనుకుంటున్నారా సార్! చెప్పిందే చేయాలి అంటాడు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడు ఆయన చెప్పిందే మనం వినాలి. అంటూ జాయిన్ అయినప్పటినుండి తనని ఎన్ని రకాలుగా టార్చర్ చేశాడో మొత్తం సంజయ్ ముందు బయట పెట్టాడు రాహుల్. సంజయ్ వస్తున్న నువ్వు ఆపుకుంటూ అయ్యో పాపం నిజంగానే  నీ కష్టం ఆ పగవాడికి కూడా రాకూడదు రాహుల్ అయినా ఇంత భరిస్తూ ఇక్కడే ఎందుకు జాబ్ చేస్తున్నావ్ అని అడిగాడు సంజయ్. ఏదో ఒక రోజు ఆ పై వాడు నా బాధ వినకపోతాడా!?  ఇంతకంటే తిప్పలు పెట్టే అమ్మాయి ఈయన లైఫ్ లోకి రాకపోతుందా!? అక్క పోతుందా ఈయన గారిని ముక్కు తుప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాకించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాను! అందుకే  అవి జరిగేటప్పుడు ఆ అందమైన దృశ్యాలు నా కళ్ళారా చూడాలని ఇంకా ఇక్కడే జాబ్ చేస్తున్నాను” అన్నాడు. ఏంటి జీవో అందమైన దృశ్యాలు చూడాలని  అంటున్నావ్ అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించి భయంతో బిగుసుకుపోయాడు రాహుల్.సా…సార్! అదేం లేదు సార్ ఎప్పుడైనా హాలిడే దొరికితే సోలో ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్న దాని గురించి సంజయ్ సార్ తో మాట్లాడుతున్న అని చెప్పాడు రాహుల్. ట్రిప్పులు వెకేషన్ లో అంటూ టైం వేస్ట్ చేస్తూ ఎప్పటికీ సక్సెస్ కాలేదు. అయినా నువ్వు ఎప్పుడు ఏం చెయ్యాలో అనేది నా చేతుల్లో ఉంది. నువ్వు ప్లాన్ చేసిన ట్రిక్ వెళ్లలేవు అని అన్నాడు ఆదిత్య. రాహుల్ సంజయ్ కి దగ్గరగా జరిగి చెప్పానా సార్  అన్ని ఈయన గారు చెప్పినట్లే జరగాలంట ఆఖరికి నేనేం ప్లాన్ చేసుకోవాలో కూడా ఆయనే చెప్తాడంట! ఇలాంటి తల తిక్కల బాస్ మనకి తప్ప ఇంకెక్కడ దొరకడు” అని చిన్నగా అన్నాడు. ఆఫీస్ కంప్లీట్ అయ్యే అందరూ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సీక్రెట్ చాంబర్లో సంజయ్ ఆదిత్య కలిసి తమ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. ఆదిత్య తన రెండు చేతుల్ని వెనక్కి తీసి టెన్షన్ గా స్క్రీన్ పై కౌంట్ అవుతున్న నెంబర్స్ ని చూస్తూ.. ఉన్నాడు. సంజయ్ చిన్నగా 4.. 3.. 2.. 1అని అనగానే ఒక్కసారిగా స్క్రీన్ పై రౌండ్ గా తిరుగుతూ ఉన్న ఒక లైక్ ప్రత్యక్షమైంది. సిస్టం పై కనిపిస్తున్న లైట్ బాల్ వైబ్రేట్ అవుతూ “హూ ఆర్ యు!?” అని అడిగింది. ఆ మాటలు వినగానే ఆదిత్య ఆశ్చర్యగా సంజయ్ వైపు చూసాడు. సంజయ్ అయితే అసలు అక్కడికి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా  స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నాడు. ఆదిత్య సైడ్ స్మైల్ ఇస్తూ… “హుమ్ I’m your creator!” అని సమాధానం ఇచ్చాడు. అతని మాటలు విన్న AI సిస్టం కాసేపు సైలెంట్ గా అయి ఒక్కసారిగా “ నువ్వు నన్ను ఎందుకు సృష్టించావు!?” అని అడిగింది. దాని గొంతు  సీక్రెట్ చాంబర్ నలుమూలల నుండి ప్రతిధ్వనించింది. అదంతా చూడటానికి సంజయ్ కి చాలా భయం వేసింది. ఏఐ అడిగిన ప్రశ్నకు ఆదిత్య రెడీగా లేకపోవడంతో కాస్త ఆలోచించి… “ఇప్పుడు ఉన్న ఏఐ సిస్టం కంటే ఎక్కువ తెలివిగా ఆలోచించి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి!” అన్నాడు.To be continued....