Chapter 18: chapter 18

Ho my loveWords: 6204

ఒక్క క్షణం అతని కోసం జనాలు కొట్టిన చప్పట్లు అతని చెవుల్లో మారుమ్రోగాయి. అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ పక్కకు నెట్టి, నాకు ఇప్పుడు ఎలాంటి బంధాలు బంధుత్వాలు అవసరం లేదు. నాకు కావాల్సిన పవర్ సాధించడానికి ఈ నెమోసిస్ చాలా ముఖ్యం అనుకున్నడు.“ ఏంటి బాస్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీ డ్రీమ్ ని ఎర్చివ్ చేసినందుకా అని అడిగాడు అర్జున్. “నా డ్రీమ్ అప్పుడే ఎక్కడ పూర్తయింది!? నేను హ్యాపీగా ఉన్నది అందుకు కాదు, మరి కాసేపట్లో ది గ్రేట్ సుప్రీమ్ సిటిజన్ అవార్డ్ గ్రహీత విక్రమ్ ధ్రువ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు” అంది అనన్య. నేను కూడా అదే కదా మేడం చెప్పాను.. తన విజయంతో గుర్తింపు తెచ్చుకున్న అలాంటి గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు కూడా విజయం సాధించినట్లే కదా అని అడిగాడు అర్జున్. అనన్య అతని తలపై చిన్నగా ఒకటి ఇచ్చి అలాంటి గొప్ప వ్యక్తులు సాధించిన విజయాన్ని నలుగురికి తెలియచేయడం మంచిపనే కానీ, మనం అక్కడే ఆగిపోకూడదు అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఏ అజెండాతో వర్క్ చేస్తున్నామో దాన్ని సాధిస్తే మన పేరు కూడా వాళ్ళలానే నలుమూలల మారు మ్రోగిపోతుంది. అది డ్రీమ్ ని అర్చివ్ చేయడం అంటే!” అని అంది. ఓకే మేడం ఇంకా సేపట్లో విక్రమ్ ధ్రువ్ ని మీరు చేసిన ఇంటర్వ్యూ చేయాలి కదా రెడీగా ఉన్నారా!? అని అడిగాడు అర్జున్. ఈ అనన్య ఆల్వేస్ రెడీ! అంటూ కెమెరా ముందుకు వచ్చి కూర్చుంది అనన్య. ఆల్ ద బెస్ట్ మేడం! చూద్దాం ఎంతమంది దాన్ని లైవ్ చూస్తారోనని అన్నాడు అర్జున్. అప్పుడే మూర్తి హడావిడిగా లోపలికి వస్తూ అనన్య నువ్వు రెడీగా ఉన్నావా మిస్టర్ విక్రమ్ ధ్రువ్ ఆల్రెడీ స్టూడియో కి వచ్చేసారు. ఇంకాసేపట్లో మన ముందు ఉండబోతున్నాడు అన్నాడు. “ఇంకాసేపట్లో కాదు సార్ మీరు వెనక తిరిగితే మీ ముందే ఉంటారు” అని అంది అనన్య. ఆ మాట వినడంతోనే మూర్తి షాకై వెనక్కి తిరిగి  ఫేస్ లో ఉన్న టెన్షన్ కవర్ చేసుకోవడానికి చిన్నగా నవ్వుతూ వెల్కం మిస్టర్ విక్రమ్ ధ్రువ్! మీరు మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్!” అంటూ అతనికి షేక్ అండ్ ఇచ్చాడు. విక్రమ్ చిన్నగా నవ్వుతూ… “ఇట్స్ మై ప్లెజర్!” అంటూ అనన్య వైపు చూసి “మిస్ అనన్య గారు హోస్ట్ అని తెలియగానే వెంటనే ఇంటర్వ్యూ ఒప్పుకున్నాను. ఎవరికి తెలుసు లైఫ్ లో మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అని..!” అన్నాడు. విక్రమ్ నవ్వు వెటకారం గా అనిపించి అనన్య కాస్త ఘాటుగా స్పందిస్తూ… “గార్లు వడలతో  ఇక్కడ ఏం పని లేదు బ్రో జస్ట్ కాల్ మీ అనన్య!” అంది. ఆమె మాటలకు మూర్తి కోపంగా అనన్య ఏంటా మాటలు అయినంత పెద్ద వ్యక్తిని పట్టుకొని బ్రో అని పిలుస్తావ్ ఏంటి!? ఇదేనా మన స్టూడియోకి వచ్చే గెస్ట్ కి ఇచ్చే మర్యాదా!” అంటూ అనన్య పై అరిచాడు. “ఇట్స్ ఓకే మిస్టర్ మూర్తి… చిన్నపిల్ల కదా!  వదిలేయండి అన్నాడు విక్రమ్.To be continued....