Chapter 19: chapter 19

Ho my loveWords: 5151

ఇదేనా మన స్టూడియోకి వచ్చే గెస్ట్ కి ఇచ్చే మర్యాదా!” అంటూ అనన్య పై అరిచాడు. “ఇట్స్ ఓకే మిస్టర్ మూర్తి… చిన్నపిల్ల కదా!  వదిలేయండి అన్నాడు విక్రమ్.అనన్య చిరుకోపంగా “ఐ యామ్ నాట్ ఎ కిడ్! నేను ఇక్కడ ఒక ప్రొఫెషనల్ జర్నలిస్టుని అలానే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోయేది కూడా నేనే! అయినా కూడా మీరు నన్ను చూసి చిన్నపిల్లని అనడం ఇన్సల్టింగ్ గా వుంది” అంది. బాస్ ఏం చేస్తున్నారు ప్రోగ్రాం కి టైం అవుతుంది మీరు ఇప్పుడు ఇలా కోప్పడితే మేకప్ అంతా పాడవుతుంది! అసలు లో బడ్జెట్లో ఉన్నమని మేనేజర్ చీప్ మేకప్ ప్రొడక్ట్స్ కొంటున్నాడని బయట టాక్! అవన్నీ వాడితే మీ గ్లామర్ దెబ్బతింటుంది” అన్నాడు అర్జున్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అర్జున్ అని పంట బిగున కోపం బిగబెట్టుకుంటూ చిన్నగా అడిగింది అనన్య. ఇప్పుడు మీరు మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడి ఫేస్ పాడైతే రోజంతా నేను మీతోనే వర్క్ చేయాలి కాబట్టి మీ ముఖం చూడలేక ఇబ్బంది పడాలి అని చిన్నగా గోణిగాడు అర్జున్. అనన్య తన కోపాన్ని అనుచుకొని చిన్నగా నవ్వుతూ “అర్జున్  ఆఫ్టర్ ఇంటర్వ్యూ మన న్యూస్ ఛానల్ ఒక బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది.  అదేంటంటే జర్నలిస్ట్ అనన్య దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ అర్జున్ దారుణ హత్యకు గురయ్యాడని, చక్కగా ఇంటర్వ్యూ చేసుకునే మనకి క్రైమ్ న్యూస్ లు అవసరమా!?” అని అడిగింది. నో బాస్ అంటూ అర్జున్ వెనక్కి అడుగులు వేశాడు. లైఫ్ కి టైం అయింది ఇంటర్వ్యూ మొదలుపెడదామా అన్నాడు మూర్తి. Ok సార్ అంటూ వెళ్లి తన సీట్ల కూర్చుని హెవీ బిల్డప్ తో విక్రమ్ ని ఇన్వైట్ చేసింది అనన్య. మరోవైపు ఆదిత్య తన ఆఫీసులో ఉన్న పర్సనల్ రూంలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా సడన్గా స్క్రీన్ పై వచ్చిన నోటిఫికేషన్ చూడగానే అతని నొసలు ముడిపడ్డాయి. ఆ నోటిఫికేషన్ విక్రమ్ ధ్రువ్ ఇస్తున్న ఇంటర్వ్యూ గురించి కావడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసాడు. “హాయ్ యువర్ దిస్ ఇస్ అనన్య ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నం. అతను ఎవరు అనేది ఈ పాటకి మీకు తెలిసే ఉంటుంది. కానీ అతని గురించి నేను చెప్పాల్సిన రెండు లైన్లు చెప్పి మీ అందరికీ  చేస్తాను! అందరం బాగుండాలి అనే మాటనుండి మన వాళ్ళు బాగుండాలి! మనవాళ్లు బాగుండాలి నుండి మనం మాత్రమే బాగుండాలి! మనం నుండి నేను మాత్రమే బాగుండాలి అనే స్టేజ్ కి వచ్చేసింది నేటి యువతరం. To be continued....