Chapter 20: chapter 20

Ho my loveWords: 5863

అందరం బాగుండాలి అనే మాటనుండి మన వాళ్ళు బాగుండాలి! మనవాళ్లు బాగుండాలి నుండి మనం మాత్రమే బాగుండాలి! మనం నుండి నేను మాత్రమే బాగుండాలి అనే స్టేజ్ కి వచ్చేసింది నేటి యువతరం. ఎవరి స్వార్థం వారిది అన్నట్లుగా ఉన్న ఈ రోజుల్లో తను మాత్రమే బాగుపడితే సరిపోదు తన చుట్టూ ఉన్న వాళ్లు కూడా బాగుండాలని ద్రువ్ ఇండస్ట్రీ స్థాపించి అభివృద్ధి ధ్యేయంగా  ముందుకు సాగిపోతూ ఆ అభివృద్ధి ప్రకృతి వరాలను నాశనం చేయకూడదని గ్రీన్ టెక్ ప్రధాన ఎజెండాగా  ముందుకు సాగుతూ విజయం సాధించిన మిస్టర్ విక్రమ్ ధ్రువ్ మన ముందు ఉన్నారు” అని అనన్య అనగానే కెమెరా విక్రమ్ వైపు తిరిగింది. కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని అదంతా చూస్తున్న ఆదిత్య తన చేతితో బలంగా డెస్క్ పై కొట్టాడు. విక్రమ్ నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పిన తర్వాత అనన్య మాట్లాడటం కంటిన్యూ చేస్తూ… మనందరికీ తెలిసిన విషయమే మిస్టర్ విక్రమ్ ధ్రువ్ ఒక ప్రకృతి ప్రేమికుడని,  అతనికి  ఈ గ్రీన్ టెక్ ఆలోచన రావడానికి కారణం అతను వ్యవసాయ కుటుంబం నుండి రావడం మరింకేదైనా ఉందా అని అతని మాటల్లోనే తెలుసుకుందాం!” అంటూ విక్రమ్ వైపు తిరిగింది అనన్య.“చెప్పండి మిస్టర్ విక్రమ్  మీ గ్రీన్ టెక్ ఐడియా కి పునాది ఎక్కడ పడింది” అని అడిగింది.“మాది సిటీకి దూరంగా ఉండే ఒక చిన్న పల్లెటూరు. అమ్మ నాన్న ఒక అల్లరి చెల్లి కాస్త భూమి ఇదే మా ఆస్తి. మా నాన్నగారు చదువుకొని బిజినెస్ చేస్తూనే మరోపక్క అతనికున్న ఫ్యాషన్ తో ఫార్మింగ్ కూడా చేసేవారు. సాధారణంగా బిజినెస్ చేసే వాళ్ళకి అంత టైం ఉండదు కానీ ఫార్మింగ్ కోసం నాన్న ప్రత్యేకించి కాస్త టైం ని కేటాయించుకునేవారు అందులోనే అతనికి ఆనందం మానసిక సంతృప్తి దొరుకుతుందని చెప్తుండేవారు. ఒక రోజు సాయంత్రం నేను మా సిస్టర్ వరండాలో ఆడుకుంటుండగా సడన్గా మా నాన్న మా ఇద్దరిని పిలిచారు. ఒంటినిండా మట్టితో మురికి బట్టలతో ఉన్న మా నాన్నను చూసి ఆశ్చర్యపోయాం. నాన్న ఏంటి ఇదంతా బట్టలు చూడు ఎంత గట్టిగా చేసుకున్నావో అని నేను అనగానే నాన్నగారి కళ్ళు పెద్దవి చేసి ‘అలా మాట్లాడకూడదు విక్రమ్! నేనిప్పుడు మొక్కల్ని నాటుతున్నాను కదా మట్టిని తవ్వి మొక్కల్ని భూములకి నాటాలు కాబట్టే బట్టలు పాడవుతాయి’ అని చెప్పాడు. మరి అలా అయితే నేను కూడా ఆ మొక్క ని నాటన అని ఆయన్ని అడిగాను ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తుంది నా చేతులతోనే స్వయంగా మట్టిని తీసి మొక్కని భూమిలో నాటను. అలా చేసిన తర్వాత మా నాన్నగారు నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అని. నేను నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంది డాడ్! దీనికోసమేనా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫార్మేట్ చేస్తూ ఉంటారు అని అడిగాను.To be continued....