Chapter 21: chapter 21

Ho my loveWords: 5492

నేను నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంది డాడ్! దీనికోసమేనా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫార్మేట్ చేస్తూ ఉంటారు అని అడిగాను.హాయ్ నా చిన్నగా నవ్వుతూ అవును అంతేకాదు విక్రమ్ మనం చేసే ప్రతి పని కూడా మనకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తుందనే దానిపైన కాకుండా అది ఇతరులకు ఎంత మేలు చేస్తుంది అని ఆలోచించాలి. మరీ ముఖ్యంగా ప్రకృతి వనరులు గురించి. వాటిని మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి అని చెప్పారు. నేను నాటిన మొక్క వైపు చూస్తూ తప్పకుండా డాడ్ నేను పెద్దయ్యాక మీ మాటలు పాటించి గొప్ప పేరు సంపాదించుకొని మీరు గర్వపడేలా చేస్తాను”  అని ఆరోజే ఆయనకు మాటిచ్చాను. అన్నాడు విక్రమ్. ఆ మాటికీ అనన్య గట్టిగా నవ్వుతూ…  నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది అనమాట!” అంటూ తల తిప్పి చూడగానే మూర్తి ఆమె వైపు గుర్రుగా చూస్తూ వున్నాడు. అదే వెంటనే అన్నయ చిన్నగా తల కొట్టుకుంటూ ఐ మీన్ మీ  నాన్నగారికి ఇచ్చిన  మాటను నిలబెట్టుకోవడానికి మీకు 20 ఇయర్స్ పట్టింది, ఇప్పుడు మనం ప్రోగ్రాం లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం! చూస్తూనే ఉండండి వ్యూవర్స్!” అని చెయ్యి అడ్డుపెట్టి విక్రమ్ కి వినిపించకుండా నెక్స్ట్ విక్రమ్ గారి విజయానికి రహస్యాలు ఏంటో తెలుసుకుందాం!” అని అంది. అప్పటివరకు కదలకుండా చైర్ లో కూర్చుని ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాది ఒక్కసారిగా పైకి లేచి మెల్లిగా అడుగులు వేసుకుంటూ క్లాస్ డోర్ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉన్నాడు. మెల్లిగా అతని ఆలోచనలు  తన బాల్యంలోకి జారుకున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అర్థం పట్టేలా ఉన్న ఒక చిన్న ఇంట్లో  పదేళ్ల కుర్రాడు కుర్చీని విరిగిన ట్రాన్సిస్టర్ రేడియోని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక వ్యక్తి గంభీరంగా అటువైపు నడుచుకుంటూ వస్తూ మెల్లిగా డోర్స్ ఓపెన్ చేసి ఆదిత్య ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఆదిత్య తల పైకెత్తి చూడకుండానే… దీన్ని సరిచేస్తున్నాను నాన్న అని సమాధానం ఇచ్చాడు. ఆదిత్య ఏం చేస్తున్నాడో చూసి వాళ్ళ నాన్నగారు చిన్నగా నవ్వుతూ దాన్ని నువ్వు సరి చేయడం ఎందుకు నేను దాన్ని బాగు చేయిస్తాలే అని అన్నాడు. ఇదేమంత పెద్ద కష్టం కాదు నాన్న  దీని ఎలా సరిచేయాలో నాకు అర్థమైంది అని చెప్పాడు ఆదిత్య. దాని సంగతి పక్కన పెట్టు ముందు నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా లేదా!? అని అడిగాడు అతను. అది ఎప్పుడో పూర్తయిపోయింది దాని నువ్వేం కంగారు పడొద్దు నాన్న. ఇప్పుడు ఈ పని కూడా పూర్తయింది అని తన చేతిలో ఉన్న దాని రిపేర్ చేసే వాళ్ళ నాన్న ముందు ఉంచాడు.To be continued....