Chapter 23: chapter 23

Ho my loveWords: 6914

మీకు స్కూల్ టీచర్ గా జాబ్ రాగానే జీవితంలో ఏదో సాధించేసానని మీరు అక్కడ ఆగిపోయారు అందుకే ఈరోజు మన లైఫ్ లో ఇలా మిడిల్ క్లాస్ దగ్గర ఆగిపోయాయి నాన్న. అదే నువ్వు అప్పుడు రిస్క్ తీసుకొని జాబు వద్దని బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉండేవాళ్ళం అని అన్నాడు ఆదిత్య.అతని మాటలకు కోపం వస్తున్న తన తన కంట్రోల్ చేసుకుంటూ ఆదిత్య  నీ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నీకు అలా బ్రతకాలి అనిపించడం తప్పుకాదు. కానీ అందుకు నువ్వు వేరే వాళ్ళని నిందించడం తప్పు. నీకు లగ్జరీ లైఫ్ కావాలంటే అది నువ్వు సాధించి చూపించు అంతేకానీ నేనెందుకు సాధించలేకపోయానని అడిగే హక్కు నీకు లేదు ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు అదే నువ్వు అన్నవి ఒక స్కూల్ టీచర్  అని అది నాకు నలుగురిలో గౌరవాన్ని  అభిమానాన్ని తెచ్చిపెడుతుంది. నాకు అది చాలు అన్నాడు. ఆదిత్య ఎగతాళిగా నవ్వుతూ చేతకానితనం అని చెప్పలేక గౌరవం తృప్తి అభిమానం అంటూ సాకులు చెప్తున్నావా నాన్న అని అడిగాడు. అప్పటివరకు కోపాన్ని అనుచుకున్న అతను ఆదిత్య మాటలు హద్దు నేరడంతో ఆవేశం పట్టలేక ఆదిత్య చెంపను చెల్లు మనిపించాడు. సరిగ్గా అప్పుడే భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చిన ఆదిత్య వాళ్ళ అమ్మగారు అక్కడ జరిగింది చూసి కంగారుగా   వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వయసుకు వస్తున్న పిల్లలపై చేయి చేసుకుంటారేంటి అని అడిగింది. ఎందుకు కొట్టాను నీ కొడుకుని అడుగు! వాడికి ఈ స్కూల్ టీచర్ కొడుకుగా వచ్చిన గౌరవం  పనికిరాదు అంట!  రేయ్ నువ్వు ఏం లగ్జరీస్ లైఫ్ చూసి ఇలా మాట్లాడుతున్నావో  అది సాధించి నాకు లెక్చర్స్, ఇప్పటివరకు నువ్వు ఈ స్కూల్ టీచర్ పెట్టిన ఫుడ్ తింటూనే బ్రతుకుతున్న విషయం మర్చిపోవద్దు” అన్నాడు. తండ్రి మాటలకు ఆదిత్య పిడికిలి ఆవేశంగా బిగుసుకుంది. నేను ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడలేదు. ప్రపంచమంతా డబ్బు సక్సెస్ అంటూ పరిగెడితే మీరు మాత్రం  గౌరవం అభిమానం క్రమశిక్షణ అంటూ కూర్చున్నారు. చూస్తూ ఏదో ఒక రోజు  గొప్పవాడుగా ఎదిగి మీరు అన్న ఆ గౌరవం అభిమానం డబ్బుతోనే కొంటాను  అన్నాడు ఆదిత్య. క్రమశిక్షణ లేని జీవితం, అదుపు లేని ఆవేశం, ఎదుటివారిని గౌరవించకపోవడం వంటి అవలక్షణాలు ఉన్నంతవరకు నువ్వు ఎప్పటికీ వాటిని పొందలేవురా! ఒకవేళ నీకు విజయం దక్కినా కూడా ప్రజల అభిమానం అయితే ఎప్పటికీ దక్కదు!” అని అన్నా అతని తండ్రి మాటలు ఆదిత్య చెవిలో ప్రతిధ్వనించాయి.“హలో బాస్ మిమ్మల్ని ఎటు చూస్తున్నావ్!” అంటూ తనని ఎవరు పిలుస్తున్నట్లుగా అనిపించి తలతిప్పి చూసాడు ఆదిత్య.‘ఇక్కడ నేను తప్ప మరొకరు లేరు మరి నన్ను పిలిచింది ఎవరు అనుకున్నాడు. “నేనే పిలుస్తున్నాను బాస్! మన బ్రేక్ టైం అయిపోయింది ఇక ఇంటర్వ్యూ లోకి వెళ్లి పోదామా!” అంటూ మళ్లీ విక్రమ్ ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది అనన్య. అప్పుడు అర్థమైంది ఆదిత్యకు తను స్క్రీన్ ఆఫ్ చేయకుండా అలానే వదిలేసిన విషయం.“మిస్టర్ విక్రమ్ ధ్రువ్! మీ గురించి మీ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు ఇప్పుడు  ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం.To be continued....