Chapter 3: chapter 3

Ho my loveWords: 5796

అలాంటి నన్ను.. నీకు ఇక్కడ జాబ్ చేసే ఉద్దేశం ఉందా! లేదా! అని అడిగారు అంటే నాకు అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా!?” అంటూ రాని కన్నీళ్లు తుడుచుకుంది.అనన్య చేస్తున్న ఓవరాక్షన్ కి మూర్తి తల కొట్టుకుంటూ… “నీ గురించి తెలిసి కూడా నిన్ను కదిలించాను చూడు నిజంగానే నాకు బుద్ధి లేదు.  ముందు ఆర్టికల్ ఫినిష్ చేయ్యు అది కంప్లీట్ అయిన తర్వాత రేపు సాయంత్రం మన సిటీలో జరగబోయే సుప్రీం సిటిజన్ అవార్డు ceremony ఈవెంట్ ని కవర్ చేయడానికి నువ్వు నీ అసిస్టెంట్ వెళ్ళాలి. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి” అన్నాడు మూర్తి.అప్పటివరకు చుట్టూ జరుగుతున్న వాటితో తనకి సంబంధం లేదన్నట్లుగా డెస్క్ పై పడుకొని ఉన్న అర్జున్,  మూర్తి చెప్పిన మాట వినడంతోనే తల పైకెత్తి “థాంక్యూ సార్ నన్ను కూడా బాస్ తో పాటు వెళ్ళమన్నందుకు” అన్నాడు.“ఇద్దరికిద్దరు తిక్కలోలు సరిపోయారు. మీ ఇద్దరు అటుపోతే రేపైనా ప్రశాంతంగా ఆఫీస్ ఉంటుందని నా బాధ! అందుకే మీకు ఈ పని అప్పగించింది” అని అక్కడి నుండి వెళ్లిపోయాడు మూర్తి.మూర్తి అటు వెళ్ళగానే అర్జున్ అనన్య దగ్గరికి వచ్చి “వావ్ బాస్ మనం అవార్డు ఫంక్షన్ ఈవెంట్ ని కవర్ చేయబోతున్నామా! ఈ న్యూస్ వినడానికి చాలా బాగుంది. ఎప్పుడు అక్కడికి వెళ్దామా అని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది” అన్నాడు అర్జున్.అనన్య అర్జున్ వైపు ఒక లుక్ ఇచ్చి “అంత వద్దమ్మా తగ్గించు!” అని అంది.“Ok బాస్! ఇంతకీ ఈ అవార్డ్  ఏ కంపెనీకి వచ్చిందంటారు!?” అని అడిగాడు అర్జున్.“అవార్డు ఏ కంపెనీకి వచ్చిన నాకు అనవసరం కానీ ఒక కంపెనీకి మాత్రం ఈ అవార్డు దక్కడానికి వీలు లేదు” అంది అనన్య.అర్జున్ అయోమయంగా అనన్యను చూస్తూ… “అదేంటి బాస్ అలా అన్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ కంపెనీ కి ఏదైనా స్పెషల్ ఉండాలి ఏంటది” అని అడిగాడు అర్జున్.“హుమ్… ఆదిత్య AR టేక్ సొల్యూషన్ అధినేత!” అంది అనన్య.ఆ మాట వినడంతోనే అర్జున్ షాక్ అయి “ఆ కంపెనీతో మీకేంటి ప్రాబ్లం బాస్!” అని అడిగాడు.“నా ప్రాబ్లం ఆ కంపెనీ కాదు. దాని ఫౌండర్ ఆదిత్య రెడ్డితో” అంది అనన్య.“వావ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అతను మీకు ముందే పరిచయం ఉన్నాడా!? అని అడిగాడు అర్జున్.“ఛీ… ఛీ అలాంటి వాడు నా లైఫ్ లో పరిచయం కాకూడదని రోజు ఆ దేవుని కోరుకుంటాను” అంది.“అదేంటి బాస్ అంత మాట అన్నారు అసలు అతనికి మీకు మధ్య గొడవ ఏంటి! ఐ మీన్ మీరు చెప్తున్నా ప్రాబ్లం ఏంటి?” అని అడిగాడు అర్జున్.“వాడితో వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు అర్జున్ ఎందుకంటే వాడే ప్రాబ్లం కాబట్టి! అసలు సెల్ఫిష్ అనే పదానికి నిలువెత్తు రూపం వాడు. అయినా ఎలానో రేపు వాడిని చూడబోతున్నావు కదా! అప్పుడు నీకే మేటర్ అర్థమవుతుందిలే!” అంది అనన్య.To be continued....