Chapter 4: chapter 4

Ho my loveWords: 6269

వాడితో వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు అర్జున్ ఎందుకంటే వాడే ప్రాబ్లం కాబట్టి! అసలు సెల్ఫిష్ అనే పదానికి నిలువెత్తు రూపం వాడు. అయినా ఎలానో రేపు వాడిని చూడబోతున్నావు కదా! అప్పుడు నీకే మేటర్ అర్థమవుతుందిలే!” అంది అనన్య.పడమట సూర్యుడు కనుమరుగవుతుంటే ఎల్ఈడీ లైట్స్ కాంతులతో హైదరాబాద్ సిటీ మెరిసిపోతూ ఉంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిర్మించిన ఎత్తైన బిల్డింగ్స్ మధ్య పెద్ద పెద్ద అక్షరాలతో “AR టెక్ సొల్యూషన్స్” అని ఉన్న పెద్ద బిల్డింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. మెరిసే గాజు గోడల లోపల చైర్ లో కూర్చుని holographic display ని చూస్తూ ఉన్నాడు ఆదిత్య రెడ్డి. ఆదిత్య అతను ఒక తెలివైన వ్యక్తి అనడం కంటే కూడా ఎదుటివారి బలహీనతలను అంచనా వేసి వారిపై గెలవడంలో నేర్పరి అని చెప్పొచ్చు. ప్రత్యర్థుల ఆలోచనలను అంచనా వేసి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి తన సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకుపోతున్న యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మాన్ గా మాత్రమే ప్రపంచానికి తెలుసు.కానీ అతనిలో దాగున్న చీకటి కోణం గురించి అతి తక్కువ మందికే తెలుసు. అతను ఈ ప్రపంచాన్ని చూసే విధానం ఒక చదరంగంలాగా ఉంటుంది. తను పీసెస్ కదిలించే మాస్టర్నని అనుకుంటాడు. మిగిలిన తను చెప్పినట్లు ఆడే వాళ్ళు అనేది తన అభిప్రాయం. తనకి అడ్డుగా ఉన్న వారిని అవసరమైతే చంపడానికి కూడా వెనకాడడు. ఆదిత్య క్యాబిన్ బయట నిలబడి రాకుల్ వణుకుతున్న గొంతుతో “సార్” అని చిన్నగా పిలిచాడు. ఆదిత్య తన చేతిని పైకెత్తి లోపలికి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. రాహుల్ లోపలకి అడుగులు వేస్తూనే…  చిన్నగా “సార్ రేపు నైట్ జరగబోయే సుప్రీమ్ సిటిజన్ అవార్డ్ ఈవెంట్ కి మీకు ఇన్విటేషన్ వచ్చింది” అని చెప్పాడు. ఆదిత్య తన చైర్ లో వెనక్కి వంగి వెటకారంగా నవ్వుతూ.. “ఈ అవార్డ్ ఎవరికి దక్కుతుందో గెస్ చేసి చెప్పనా!?” అన్నాడు.రాహుల్ తన తల పైకెత్తి ఆదిత్య వైపు చూస్తూ “ఎవరికీ సార్!” అని అడిగాడు. ఆదిత్య నవ్వుతూ… “మిస్టర్ విక్రమ్ ధృవ్ ది నైట్ స్టార్!” అన్నాడు. రాహుల్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దలు చేసి చూస్తూ అవునని తలాడిస్తూ “గ్రీన్ టెక్ చొరవకు గాను అతనికి ఈ అవార్డుని దక్కింది సార్!” అని చెప్పాడు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడుతున్న ఆదిత్య ముఖంపై నవ్వు మాయమై అతని ఫేస్ క్రూరంగా మారిపోయింది. ఆవేశంగా రాహుల్ ని పక్కకు నెట్టి “ఇలాంటి పనికిమాలిన విషయం చెప్పడానికా నా దగ్గరికి వచ్చావ్! నన్ను కాదని వాడెవడో అవార్డు దక్కించుకుంటే అది నాకు గుడ్ న్యూస్ ఏంట్రా! పోరా ఇక్కడి నుండి” అంటూ రాహుల్ పై గట్టిగా అరిచాడు.ఆదిత్య కోపం తెలిసిన రాహుల్ కి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. నుదిటిపై ఉన్న చెమటలు తుడుచుకుంటూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయాడు రాహుల్.తన క్యాబిల్లో ఒంటరిగా కూర్చుని సిటీలో జరగబోయే అవార్డ్ ఫంక్షన్ ఈవెంట్ ఎలా జరగబోతుందోనని ఇమేజినేషన్ చేసుకుంటున్నాడు ఆదిత్య. To be continued....