Chapter 5: chapter 5

Ho my loveWords: 5997

తన క్యాబిల్లో ఒంటరిగా కూర్చుని సిటీలో జరగబోయే అవార్డ్ ఫంక్షన్ ఈవెంట్ ఎలా జరగబోతుందోనని ఇమేజినేషన్ చేసుకుంటున్నాడు ఆదిత్య.ఒక్కసారిగా అతని కళ్ళముందు ఉన్న స్క్రీన్ పై అవార్డు ఫంక్షన్ ప్రత్యక్షమైంది. న్యూస్ ఛానల్ హడావిడి చేస్తూ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ప్రోగ్రాం ని హౌస్ చేస్తున్న వ్యక్తి  విక్రమ్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఆ చప్పుడ్లు ఆదిత్యకు మరింత ఇరిటేషన్ తెప్పించాయి. విక్రమ్ ధ్రువ్ ఆరడుగుల ఎత్తు, అందర్నీ అట్రాక్ట్ చేయగలిగే చిరునవ్వు, గంభీరమైన రూపం అతని సొంతం. లైట్ బ్లూ కలర్ 3 పీస్ సూట్ లో హుందగా స్టేజ్ పైకి నడుచుకుంటూ  వచ్చాడు విక్రమ్. మైక్ తీసుకోగానే అక్కడ ఉన్న వారిని ఉద్దేశిస్తూ… “As innovators గా మానవాళి అభివృద్ధికి మనం టెక్నాలజీని యూస్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది” అని సింపుల్గా రెండు ముక్కల్లో తను ప్రసంగాన్ని ముగించాడు విక్రమ్. అతను ఏం చెప్పినా గంగిరెద్దుల తల ఊపుతూ చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు అన్నట్లుగా జనాలు గోల చేస్తూ ఉంటే… అదంతా చూస్తున్న ఆదిత్య దవడ బిగుసుకుంది. తన చేతి వేళ్లను చైర్ అర్మ్ రెస్ట్ పై కదిలిస్తూ… కోపంగా విక్రమ్ ని చూస్తూ ఉన్నాడు.ప్రపంచానికి విక్రమ్ ఒక హీరో కావచ్చు అతని సిద్ధాంతాలు, హ్యూమనిటి ఉన్న గొప్ప వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ ఆదిత్య దృష్టిలో అతను ఒక అడ్డుగొడ. తనుకు దక్కాల్సిన విజయాన్ని, పేరు ప్రఖ్యాతులను దక్కనివ్వకుండా అడ్డుపడుతున్న ఒక ట్రాన్స్పిరియంట్ గ్లాస్ వాల్ లా అతని కళ్ళకి కనిపించాడు.“బాధ్యత my ఫుట్” అని వెటకారంగా నవ్వుకున్నాడు. విక్రమ్ మాటలు తన చెవుల్లో మార్మొగుతుంటే… “హ్యూమినిటీ అంటే ఏంటో నీకు చూపించాల్సిన టైం వచ్చింది మిస్టర్ విక్రమ్” అని అనుకోగానే స్క్రీన్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. ఆదిత్య తన ఇమేజ్నరీ వరల్డ్ నుండి బయటకు వచ్చి అక్కడి నుంచి భయటకు నడిచాడు. అప్పటికే రాత్రి కావడంతో కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయిస్ అందరూ వెళ్లిపోయారు. దాంతో ఆఫీస్ అంత గుండు పిన్ను కింద పడిన వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఖాళీగా ఉన్న హాల్లో ఆదిత్య నడుచుకుంటూ వస్తుంటే అతని అడుగుల చప్పుడు నలుమూలల నుండి ప్రతిధ్వనిస్తుంది. కంపెనీలోని ఎవరు వెళ్ళటానికి వీలులేని ఒక సీక్రెట్ ఛాంబర్ లోపలికి నడిచాడు ఆదిత్య.అతని అడుగులు ఒక్కొక్కటిగా పడుతుంటే అక్కడ లైట్స్ ఆన్ అవుతూ ఉన్నాయి.  అలా కాసేపు నడిచాక ఒక పెద్ద రూమ్ దగ్గరకు వచ్చాడు. ఆ రూమ్ ముందు ఒక పెద్ద సెక్యూరిటీ డోర్ ఉంది దానిపైన ఆదిత్య చెయ్యి ఉంచాగానే అతని ఫింగర్ ప్రింట్స మ్యాచ్ అవడంతో వింత సౌండ్లు చేస్తూ మెల్లిగా సెక్యూరిటీ  డోర్స్ ఓపెన్ అయ్యాయి.To be continued....