Chapter 6: chapter 6

Ho my loveWords: 6024

ఆ రూమ్ ముందు ఒక పెద్ద సెక్యూరిటీ డోర్ ఉంది దానిపైన ఆదిత్య చెయ్యి ఉంచాగానే అతని ఫింగర్ ప్రింట్స మ్యాచ్ అవడంతో వింత సౌండ్లు చేస్తూ మెల్లిగా సెక్యూరిటీ  డోర్స్ ఓపెన్ అయ్యాయి.కంపెనీలో వర్క్ చేసే ఎవరికీ కూడా ఈ సీక్రెట్ రూమ్ గురించి పెద్దగా తెలియదు. ఆ రూమ్ మధ్యలో స్క్రీన్ పై ఉన్న తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంది.నెమెసిస్ ఇదొక AI  ప్రాజెక్ట్ డిజైన్. బిజినెస్ పరంగా తనకు ఎదురయ్యే ఏ కాంపిటీటివ్ నైనా నాశనం చేయటానికి సృష్టించిన AI టెక్నాలజీ.  స్క్రీన్ పై ఉన్న ప్లాన్ చూడగానే ఆదిత్య చూపులు గంభీరంగా మారిపోయాయి.  విక్రమ్ కోసం జనాలు అభిమానంగా చేస్తున్న కరచాల ధ్వనులు గుర్తుకు చేసుకుంటూ ‘వాళ్లకి హీరో కావాలంట. నేను వాళ్లకి  అంతకంటే బెటర్ ఇస్తాను. అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు జై కొట్టిన హీరోనే ఛీ కొట్టేలా చేస్తాను.విక్రమ్ నువ్వు ఏంత ప్రయత్నించినా దీని నుండి తప్పించుకోలేవు. అలా అని దీన్ని ఎదుర్కొని ఓడించలేరు’ అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ప్రాజెక్ట్ మెయిన్ ఇంజనీర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన సంజయ్ వచ్చాడు. అతని చూడగానే ఆదిత్య గంబీరంగా “ఎక్కడ వరకు వచ్చింది ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టేనా!?” అని అడిగాడు.“యా ఆదిత్య! ఆల్మోస్ట్ అయిపోయింది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టుగా చూపిస్తుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకు! మనం దీన్ని యూస్ చేసే ముందు ఇంకా కొన్ని టెస్ట్లు చేస్తే బాగుంటుంది” అన్నాడు సంజయ్. ఆదిత్య సైడ్ స్మైల్ చేస్తూ “ఇన్నోవేషన్ అంటే సేఫ్ గా ఆడే ఆట కాదు సంజయ్! రిస్క్ తీసుకుంటేనే ముందుకి అడుగు వేయగలం” అన్నాడు.“I know ఆదిత్య. but” అని సంజయ్ ఏదో చెప్పబోతుంటే! సైలెంట్ గా ఉండమన్నట్లుగా చెయ్ పైకి ఎత్తి చూపించాడు ఆదిత్య.దాంతో సంజయ్ సైలెంట్ అయిపోయాడు. ఇక ఎంత చెప్పినా ఆదిత్య వినడని అర్థమై అయిష్టంగానే ఆదిత్య చెప్పిన పనికి ఒప్పుకున్నాడు. కానీ incomplete గా ఉన్న నెమోసిస్ ని ప్రోగ్రెస్ చెయ్యాలి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లెమ్స్ వస్తాయో! దాని వల్ల ఏం జరుగుతుందోనని అతని మనసులో ఏదో మూల చిన్న భయం. ఆదిత్య మాత్రం అసలు భయపడలేదు. ఎందుకంటే అతను దృష్టిలో నేమోసిస్ అనేది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, త్వరలోనే తనని బిజినెస్ వరల్డ్ లో తిరుగులేని మహారాజుగా నిలబెట్టేబోయే ఒక సూపర్ పవర్.  సంజయ్ తన పని తాను చెయ్యడం స్టార్ట్ చేశాడు. ఆదిత్య నెమోసిస్ ని చూస్తూ… ‘మేబి దీని పవర్ తో విక్రమ్ ధృవ్ ను బిజినెస్ వరల్డ్ నుంచి ఇది శాశ్వతంగా ఎలిమినేట్ చేయొచ్చు’ అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు ఆదిత్య. రాత్రి గడిచే కొద్దీ తన ఆఫీస్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య. అతని ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ… సడన్గా తన ఫోన్ కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది.To be continued....