Chapter 8: chapter 8

Ho my loveWords: 4919

ఏమో నాకేం తెలుసు అతను గొప్పవాడో కాదోనని! కానీ ఒకటి చెప్పగలను  మంచి మనసున్న యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ అని, అందుకేగా ఈ అవర్డ్ అతనికి దక్కింది అంది అనన్య.ఆమె మాటలు పట్టించుకోకుండా అర్జున్ అందర్నీ చూస్తూ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండడం గమనించి ఏమైంది ఎవరికోసం వెతుకుతున్నట్లుగా ఉన్నావ్ అని అడిగింది అనన్య.అదే బాస్ మీరు చెప్పిన ఆ సెల్ఫిష్ కి నిలువెత్తు రూపం ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతున్నాను” అన్నాడు అర్జున్. ఆ మహాసయుడు సభకు ఇంకా దయచేనట్లు ఉన్నాడు నువ్వు కంగారు పడకు” అని అంది అనన్య. సరిగ్గా అప్పుడే గోల్డ్ కలర్లో వెలిగిపోతున్న షాండిలియర్లు కాంతుల మధ్యలో బ్లాక్ కలర్ షూట్ వేసుకొని స్టైల్ గా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు ఏ ఆర్ టెక్ సొల్యూషన్ అధినేత ఆదిత్య రెడ్డి. అతను లోపలికి రాగానే అప్పటివరకు గందరగోళం గా ఉన్న ఆ కాన్ఫరెన్స్ ఆడుతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అందరూ సైలెంట్ అయిపోవడం గమనించిన అర్జున్ బాస్ మీరు చెప్పిన సెల్ఫీస్ అతనేనా అని అడిగాడు. య బాగానే గెస్ చేసావ్ అంది అనన్య. అది ఓకే బాస్ కానీ అతను రాగానే ఎందుకు అందరూ సైలెంట్ అయిపోయారు!? అతను అంత డేంజరా అని అడిగాడు. అనన్య చిన్నగా నిట్టూర్చి  ఆకలిగా ఉన్న సింహనికి ఎదురులేని సాహసం ఎవరైనా చేస్తారా అని అడిగింది. అంటే మీరు అతన్ని సింహం అని అంటున్నారా అని అడిగాడు అర్జున్.  ఛి ఛి ఏడు సింహమేంటి అంతకంటే డేంజరైన గుంటనక్క గాడు ఆ సింహమైనా ఆకలి తీరాక వేటాడడం ఆపేస్తుంది కానీ గుంట నక్క అవసరం దొరికినప్పుడల్లా వేటాడుతూనే ఉంటుంది అంది. బాస్ నాకు ఒక విషయం బాగా అర్థమైంది మీరు ఆ ఏఆర్ టెక్ అధినేత మిస్టర్ ఆదిత్య రెడ్డిని బాగా స్టడీ చేసినట్లుగా ఉన్నారు అని అడిగాడు అర్జున్. గొప్ప విషయమే కనిపెట్టావ్ గాని ముందు పని చూడు  అంది అనన్య.అక్కడ ఉన్న వాళ్లంతా తనని చూడగానే సైలెంట్ అవ్వడం చూసి ఆదిత్య ఫేస్ ప్యాక్ గర్వంత కూడిన చిన్న చిరునవ్వు చేరి క్షణంలో మాయమైంది.  గంభీరంగా ఉన్న అతని ఫేస్  చూసి నవ్వితే వీడు సొమ్ము ఏమైనా పోతుందా! లేక ఏఆర్ టెక్ సొల్యూషన్ కూలిపోతుందా!? ఫెవికాల్ ఇస్ అతికించినట్లు ఎప్పుడు ఉమ్… అని మొహం పెట్టుకొని ఉంటాడు” అని చిన్నగా ఆదిత్యను తిట్టుకుంది.To be continued....