Chapter 2: chapter 2

Ho my loveWords: 5786

“అనన్య… అనన్య వేర్ ఆర్ యు! ఎక్కడ ఉన్నావ్!?” అంటూ క్రియేటివ్ హెడ్ మూర్తి అరుస్తూ ఉన్నాడు.అయిన కూడా అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి “ఏమైపోయింది ఈ పిల్ల!” అని చిన్నగా గొనుక్కుంటూ చుట్టూ తిరిగాడు.సరిగ్గా అప్పుడే టేబుల్ కింద నుండి చిన్నగా “ఇక్కడ ఉన్నాను సార్!”  అని ఒక తీయని స్వరం వినిపించింది.మూర్తి వెనక్కి తిరిగి చూసాడు. కాని అక్కడ ఎవరూ లేకపోవడం చూసి “ఎక్కడ ఉన్నావ్ అనన్య! మాట వినిపిస్తుంది కానీ మనిషివి  కనిపించడం లేదు” అన్నాడు.“పైకి కాదు సార్ కాస్త తల దించి కిందకి చూడండి ఇక్కడ టేబుల్ కింద ఉన్నాను” అని అంది అనన్య.“టేబుల్ కింద అక్కడ ఏం చేస్తున్నావ్ అనన్య! దాగుడుమూతలు ఆడుతున్నావా!” అంటూ కిందకి వంగి చూసాడు మూర్తి.“ఆదుకోవడం లేదు సార్! జ్ఞానం పెంచుకుంటున్న, పెన్ పడిపోయింది అని తీసుకోవటానికి కిందకి వచ్చా! కాని ఇక్కడ ఒక మంచి బుక్ దొరికితే కూర్చొని చదువుతున్నాను సార్! చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అందుకే మీరు రావడం కూడా గమనించలేదు!” అని సమాధానం ఇచ్చింది అనన్య.“గొప్ప పని చేశావులే కాని,  ముందు బయటకురా! ఇంకాసేపు ఇలానే వంగి నిలబడ్డాను అంటే ఇటునుండి నేరుగా ఇంటికి కాకుండా హాస్పిటల్ కి పోవాలి” అంటూ చిన్నగా కసురుకున్నాడు మూర్తి.పైకి లేచి నిలబడి “కూల్ మూర్తిగారు ఎందుకు టెన్షన్ అవుతున్నారు” అంది నవ్వుతూ అనన్య. అందం, చదువు తెలివితేటలు ఇలా వేటిలోనూ తీసిపోదు. మూర్తి ఆమెను గుర్రుగా చూస్తూ… “టెన్షన్ అవ్వక మరి ఏం చేయమంటావ్ అమ్మాయి!? నీకు ఇచ్చిన ఆర్టికల్ ని స్టడీ చేసి, దాని గురించి మ్యాటర్ కలెక్ట్ చేసి న్యూస్ రెడీ చెయ్యమని చెప్పి వారం రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఆ ఆర్టికల్ గురించి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. కానీ నువ్వు ఏంటిరా అంటే టేబుల్ కింద దూరి బుక్స్ చదువుకుంటూ కూర్చున్నవ్! అసలు నీకు ఈ ఛానల్లో జాబ్ చేసే ఉద్దేశం ఉందా! లేదా!?” అని అడిగాడు మూర్తి.ఆ మాట వినడంతోనే అనన్య తన చేతిలో ఉన్న బుక్ ని టేబుల్ పైన పెట్టి “హతవిధి ఎంత మాట అన్నారు సార్! నేను ఏ మాట అయితే వినకూడదు అనుకున్నానో అదే మాట ఈరోజు విన్నాను” అంది అనన్య డ్రామాటిక్గా..మూర్తి కంగారుపడుతూ “నేను ఇప్పుడు ఏం అంత కాని మాట అన్నాను అని నువ్వు అంతలా రియాక్ట్ అవుతున్నావ్!”  అని అడిగాడు.“అదే సార్! అదే ఎంతో ఇష్టంగా కష్టపడి జర్నలిజం కంప్లీట్ చేసి ఏదో ఒక రోజు పెద్ద న్యూస్ ని డిస్కవరీ చేసి నా పేరుతో పాటు మన ఛానల్ పేరు కూడా ప్రపంచమంతా మారుమ్రోగిపోయేలా చేయాలనేది నా కల. అలాంటి నన్ను.. నీకు ఇక్కడ జాబ్ చేసే ఉద్దేశం ఉందా! లేదా! అని అడిగారు అంటే నాకు అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా!?” అంటూ రాని కన్నీళ్లు తుడుచుకుంది.To be continued....