Chapter 17: chapter 17

Ho my loveWords: 5002

ఏఐ అడిగిన ప్రశ్నకు ఆదిత్య రెడీగా లేకపోవడంతో కాస్త ఆలోచించి… “ఇప్పుడు ఉన్న ఏఐ సిస్టం కంటే ఎక్కువ తెలివిగా ఆలోచించి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి!” అన్నాడు.“అంతేనా!?” అని అడిగింది నెమెసిస్. ఆదిత్య ముఖం చిట్లించి అంతకంటే ఇంకేం ఉంటుంది!?” అని అడిగాడు. ఆదిత్య అడిగినదాంత నెమోసిస్ సిస్టం కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అయిపోయింది. కానీ ఆ వెలుగు స్థిరంగా వుంది. సంజయ్ వణుకుతున్న స్వరంతో ఆదిత్య ఇదంతా చూస్తుంటే నాకు కాస్త భయంగా ఉంది రా మనం చేసింది కరెక్టేనా అని అడిగాడు. ఆదిత్య విసుగా ఇది మనం క్రియేట్ చేసిన జస్ట్ ఒక ప్రోగ్రాం మాత్రమే! దానికి నువ్వు ఇంతకు భయపడాల్సిన అవసరం లేదు” అన్నాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఆదిత్య  నిద్ర లేచి బాల్కనీలో ఉన్న చైర్ లో కూర్చుని సిటీ వైపు చూస్తూ వున్నాడు. చల్లని గాలి అతని ముఖాన్ని తాకుతూ ఉంటే కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస పిలిచాడు. ఏదో సాధించాను అన్న విజయ గర్వం అతని ముఖంలో కనిపిస్తూ ఉంది. నెమెసిస్ అతను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పవర్ ఫుల్ గా ఉంది, తన ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఇది కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే తన పేరు ప్రపంచం నలుమూలల ప్రపంచం నలుమూలల మారుమ్రోగిపోతుంది అనుకున్నాడు. సడన్గా రోడ్డు పై ఒక అందమైన దృశ్యం తన కంటపడింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ ఉన్నారు. తమ్ముడికి ఏం కాకూడదని జాగ్రత్తగా  తన చెయ్యి పట్టుకొని తీసుకు వెళుతున్నాడు  అన్న అది చూడగానే ఎన్నో నెల నుండి తనని కలవడానికి ట్రై చేస్తున్న తన తమ్ముడు గుర్తుకు వచ్చాడు. తను ఏదైతే సాధించాలి అనుకున్నాడో ఆ స్థానం కోసం పేరు కోసం కుటుంబాన్ని వదిలి వంటరిగా మిగిలిపోయాడు అన్న విషయం గుర్తుకు వచ్చి ఒక్క క్షణం తనని ఏదో బాధ నిలబెట్టినట్లుగా అయింది. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న  ఒక పెద్ద బిల్డింగ్ పై సుప్రీమ్ సిటిజన్ అవార్డ్ తో విక్రమ్ ధ్రువ్  ఉన్న ఫోటో ప్రత్యక్షమైంది దాన్ని చూడగానే ఆవేశంతో ఆదిత్య బిగుసుకుంది. ఒక్క క్షణం అతని కోసం జనాలు కొట్టిన చప్పట్లు అతని చెవుల్లో మారుమ్రోగాయి. అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ పక్కకు నెట్టి, నాకు ఇప్పుడు ఎలాంటి బంధాలు బంధుత్వాలు అవసరం లేదు. నాకు కావాల్సిన పవర్ సాధించడానికి ఈ నెమోసిస్ చాలా ముఖ్యం అనుకున్నడు.To be continued....