Chapter 22: chapter 22

Ho my loveWords: 5022

అది ఎప్పుడో పూర్తయిపోయింది దాని నువ్వేం కంగారు పడొద్దు నాన్న. ఇప్పుడు ఈ పని కూడా పూర్తయింది అని తన చేతిలో ఉన్న దాని రిపేర్ చేసే వాళ్ళ నాన్న ముందు ఉంచాడు.నార్మల్ గా అయితే అంత చిన్న పిల్లవాడు చేసిన పనులు చూసి ఏ తండ్రి అయిన మురిసిపోతాడు కానీ ఇక్కడ ఆదిత్య వాళ్ళ నాన్నగారు పరిస్థితి వేరేగా ఉంది. చిన్న వయసులోనే కొడుకు తెలివితేటలు, మాటలు ప్రవర్తన అన్ని కూడా వింతగా అనిపించేవి అతనికి.. క్రమంగా ఆదిత్య ఎక్కడ తన బాల్యాన్ని కోల్పోడోనని ఆందోళన పడేవాడు. ఆదిత్య వాళ్ల నాన్నగారు ఏదైతే భయపడ్డారో అదే జరిగింది వయసు పెరిగే కొద్ది ఆదిత్య ప్రవర్తన మామూలు పిల్లల కంటే కాస్త భిన్నంగా ఉండేది. అన్ని విషయాల్లో ఎప్పుడూ తనదే పై చేయి ఉండాలి అనే మొండితనం ఆదిత్యతో పాటు పెరుగుతూ వచ్చింది. తన తెలివితేటలు ఒక పెద్ద కాలేజీలో సీట్ సంపాదించాడు కానీ  అక్కడ అంతా పెద్దపెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకోవడం తను మధ్యతరగతి కి చెందిన ఒక టీచర్ కొడుకు కావడంతో వాళ్లందరి కంటే తన తక్కువ స్థాయిలో ఉన్నాడన్న భావన ఆదిత్య కు కలిగింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ దిగులుగా వరండాలో కూర్చున్నాడు ఆదిత్య. ఆదిత్య కాలేజ్ నుంచి వచ్చి ఎంత సేపు అయింది లోపలికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అడిగారా ఆదిత్య వాళ్ళ నాన్నగారు. ఆదిత్య జీరబోయిన గొంతుతో “నువ్వు ఎందుకు స్కూల్ టీచర్ దగ్గర ఆగిపోయావు నాన్న! అని అడిగాడు. తను ఏం అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా ఆదిత్యని చూస్తూ… ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావా ఆదిత్య అని అడిగాడు వాళ్ల నాన్న.“నువ్వు కూడా మిగిలిన వాళ్ళని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు నేను కూడా ఒక గొప్ప బిజినెస్ మాన్ కొడుకుని అయ్యుండే వాడిని కదా!” అని అన్నాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా!? అని కాస్త సీరియస్గా అడిగాడు ఆదిత్య వాళ్ళ నాన్న. నాకు బాగానే అర్థం అవుతుంది. మీకు స్కూల్ టీచర్ గా జాబ్ రాగానే జీవితంలో ఏదో సాధించేసానని మీరు అక్కడ ఆగిపోయారు అందుకే ఈరోజు మన లైఫ్ లో ఇలా మిడిల్ క్లాస్ దగ్గర ఆగిపోయాయి నాన్న. అదే నువ్వు అప్పుడు రిస్క్ తీసుకొని జాబు వద్దని బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉండేవాళ్ళం అని అన్నాడు ఆదిత్య.To be continued....