Chapter 7: chapter 7

Ho my loveWords: 5268

రాత్రి గడిచే కొద్దీ తన ఆఫీస్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య. అతని ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ… సడన్గా తన ఫోన్ కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది.ఆ మెసేజ్ తన తమ్ముడు నుండి వచ్చింది. “అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి ఇంటికిరా లేదా నన్నే అక్కడికి రమ్మంటావా” అని వుంది ఆ మెసేజ్ లో. స్క్రీన్ మెరుస్తుంత సేపు ఆ మెసేజ్ ని చూసాడు ఆదిత్య. కాని దానిపై ఎలాంటి ఇంట్రెస్ట్ గా చూపించలేదు. ‘బంధాలు బంధుత్వాలు అనేవి ఆటపై సరిగ్గా ఫోకస్ చేయనివ్వవు. ఇప్పుడు వీటి గురించి నా దగ్గర టైం లేదు. నా దృష్టి ఇప్పుడు నా నెక్స్ట్ మూవ్ ఏంటి అనే దానిపైనే ఉండాలి. నేను నెక్స్ట్ తీసుకునే మూవ్ నా సక్సెస్ నీ డిసైడ్ చేస్తుంది’ అనుకుంటూ మళ్లీ తన కాన్సన్ట్రేషన్ అంతా కొత్త AI ప్రాజెక్ట్ నెమెసిస్ వైపు మళ్ళించాడు. స్క్రీన్ పై ప్రాజెక్ట్  బ్లూ ప్రింట్ కనిపిస్తుంటే అతని చేతి వేళ్ళు కీబోర్డుపై వేగంగా కదులుతున్నాయి.“ఆదిత్య ఒకసారి ఆలోచించు మనం చేస్తున్న పని కరెక్ట్ కాదేమో!” అన్నాడు సంజయ్ “ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులందరిని కూడా ఈ ప్రపంచం మొదట తప్పుగానే అర్థం చేసుకుంది, తరువాతనే వాళ్ల గొప్పతనం ఏంటో గుర్తించింది. అలానే ఏదో ఒక రోజు వాళ్లు అర్థం చేసుకుంటారు నేను ఎందుకు ఇలా చేశానో అని!” అంటూ చిన్నగా గోనుకున్నాడు ఆదిత్య.తెల్లవారితే ఏం జరగబోతుందో తెలియని ప్రపంచం హాయిగా నిద్రపోతుంటే మరోపక్క రాత్రంతా ఆదిత్య, అతని స్నేహితుడు సంజయ్ AR టెక్ సొల్యూషన్లో టెక్నాలజీ పరంగా పెను తుఫాను సృష్టించడంలో బిజీగా ఉన్నారు.హైదరాబాద్ సిటీలో గ్రాండ్గా జరగబోయే బిజినెస్ సమ్మిట్ సిద్ధం అయింది. అధికారం సంపద ఇన్నోవేషన్ల మెయిన్ అజెండగా సిటీలోని   విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లో అన్ని కంపెనీల నుండి బిజినెస్ మ్యాన్స్ ఈ సమ్మిట్ కు అటెండ్ అయ్యారు. అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులకు ఒక సైడ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. అనన్య అర్జున్  వాళ్లకి కేటాయించిన సీట్ల కూర్చుని వస్తున్న వాళ్ళందర్నీ చూస్తూ ఉన్నారు. ఏంటి మేడం ఆ విక్రమ్ ధ్రువని అందరూ ఆకాశానికి ఎత్తిస్తున్నారు అతను అంత గొప్ప వాడా అని అడిగాడు అర్జున్. ఏమో నాకేం తెలుసు అతను గొప్పవాడో కాదోనని! కానీ ఒకటి చెప్పగలను  మంచి మనసున్న యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ అని, అందుకేగా ఈ అవర్డ్ అతనికి దక్కింది అంది అనన్య.To be continued....